మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని యువహీరోయిన్ కృతిశెట్టి ప్రత్యేక నృత్యాన్ని ప్రదర్శించింది. తన తొలి సినిమా 'ఉప్పెన'లోని 'ఈశ్వరా పరమేశ్వర' పాటకు నాట్యం చేసింది. ఆ వీడియోను అభిమానులతో పంచుకుంది. బెంచ్ మార్క్ స్టూడియోస్‌తో కలిసి ఈ వీడియో రూపొందించింది.
'ఈశ్వర' పాటకు కృతిశెట్టి స్పెషల్ డ్యాన్స్ - కృతిశెట్టి న్యూస్
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈశ్వరుని పాటకు అద్భుతంగా నృత్యం చేసింది కృతిశెట్టి. ప్రస్తుతం ఈ గీతం అభిమానుల్ని అలరిస్తోంది.
'ఈశ్వర' పాటకు కృతిశెట్టి స్పెషల్ డ్యాన్స్
ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ శివతత్వాన్ని వివరిస్తూ ఉప్పెన చిత్రం కోసం సాహిత్యాన్ని అందించారు. ఆ పాటకు కృతిశెట్టి అభినయం తోడవడం వల్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శివరాత్రి రోజున ఆ పాటను నృత్యం చేయడం సరికొత్త అనుభూతిని కలిగించిందనని కృతిశెట్టి తెలిపింది.