ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ కుమారుడు గణేశ్ త్వరలోనే కథానాయకుడిగా సినిమాల్లో అరంగేట్రం చేయనున్నారు. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, అమృతారావు కలిసి నటించిన చిత్రం 'వివాహ్' తెలుగు రీమేక్ ద్వారా తెరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది.
దీనికి సంబంధించిన రీమేక్ హక్కులను బెల్లంకొండ సురేశ్ ఇప్పటికే దక్కించుకున్నారని టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు పవన్ సాధినేని దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. ఇందులో గణేశ్ సరసన 'ఉప్పెన' బ్యూటీ కృతిశెట్టి ఎంపికైందని సమాచారం. అయితే ఈ రూమర్లపై హీరోయిన్ కృతిశెట్టి సోషల్మీడియాలో స్పందించింది.
"నేను నటించబోతున్న కొత్త చిత్రాలంటూ చాలా పుకార్లు వింటున్నాను. ప్రస్తుతం నేను మూడు సినిమాల్లో (నాని, సుధీర్ బాబు, రామ్ సినిమాల్లో) నటిస్తున్నాను. ఇప్పుడు నా ముందున్న లక్ష్యం ఆ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడమే. ఏవైనా సినిమాలకు సంతకం చేసినప్పుడు తప్పకుండా తెలియజేస్తాను".