తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రామ్​కు జోడీగా 'ఉప్పెన' భామ కృతిశెట్టి? - కృతిశెట్టి వార్తలు

'ఉప్పెన'తో ఆకట్టుకున్న కృతిశెట్టి తెలుగులో రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇప్పుడు రామ్​ కొత్త చిత్రం కోసం ఈమెను సంప్రదించినట్లు తెలుస్తోంది.

krithi shetty in ram-lingusamy movie
రామ్​కు జోడీగా 'ఉప్పెన' భామ?

By

Published : Feb 20, 2021, 7:24 AM IST

రామ్‌ - లింగుస్వామి కాంబినేషన్​లోని సినిమా ఇటీవల ఖరారైంది. ఇందులో రామ్‌కు జోడీగా 'ఉప్పెన' భామ కృతిశెట్టి నటించే అవకాశాలున్నాయి. ఈ మేరకు చిత్రబృందం ఆమెను సంప్రదించింది. త్వరలోనే ఈ జోడీ గురించి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

హీరోయిన్ కృతిశెట్టి

తెలుగు, తమిళ భాషల్లో శ్రీనివాస చిట్టూరి ఈ ద్విభాషా చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. మాస్‌ కథతో, అత్యుత్తమ నిర్మాణ విలువలతో సినిమాను తెరకెక్కిస్తున్నట్టు చిత్ర వర్గాలు తెలిపాయి.

ఇది చదవండి:నా నటన చూసి ఏడ్చేశారు: కృతిశెట్టి

ABOUT THE AUTHOR

...view details