తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కృష్ణాష్టమి: సూపర్ స్టార్స్​ ఉట్టి కొడితే...! - dreamgirl

బాలీవుడ్​ స్టార్​ హీరోలు షారుఖ్​ ఖాన్​, ఆయుష్మాన్​ ఖురానా..  జన్మాష్టమి వేడుకల్లో సందడి చేశారు. ముంబయిలోని తన నివాసం వద్ద ఉట్టి కొట్టాడు బాద్​షా. 'డ్రీమ్​ గర్ల్​' ప్రచారంలో భాగంగా గుజరాత్​లోని బరోడాను సందర్శించిన జాతీయ ఉత్తమ నటుడు ఆయుష్మాన్​... అందులోని 'రాధే' పాటకు డ్యాన్స్​ చేసి ఉట్టి కొట్టాడు.

కృష్ణాష్టమి వేడుకలు: ఉత్తమ నటులు ఉట్టి కొడితే

By

Published : Aug 24, 2019, 7:50 PM IST

Updated : Sep 28, 2019, 3:46 AM IST

హిందీ చిత్రసీమలోని ప్రముఖ నటులు షారుఖ్ ఖాన్​​, ఆయుష్మాన్​ ఖురానా.. శుక్రవారం జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. కృష్ణుడిని అభిమానించే బాద్​ షా... ముంబయిలో ఫ్యాన్స్ సమక్షంలో ఉట్టికొట్టాడు. అతడి అంగరక్షకుడు పైకెత్తుకోగా కుండ పగులగొట్టాడు షారుఖ్. గతేడాది కూడా తన కుమారుడు అబ్రామ్​తో కలిసి ఇలానే ఉత్సవాల్లో పాల్గొన్నాడు.

'అంధాధున్'​తో ఘన విజయం అందుకున్న ఆయుష్మాన్ ఖురానా.. 'డ్రీమ్​ గర్ల్'​ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. బరోడాను సందర్శించిన ఈ కథానాయకుడు... జన్మాష్టమి వేడుకల్లో భాగంగా ఉట్టి కొట్టాడు.

'దహీ హండి' సందర్భంగా అభిమానులను అలరించాడు. తన కొత్త సినిమాలోని 'రాధే రాధే' పాటకు నర్తించాడు. కృష్ణుడి వేషంలో ఉన్న తన ఫొటోను సోషల్​ మీడియాలో పంచుకున్నాడు.

కృష్ణాష్టమి వేడుకల్లో ఆయుష్మాన్​ ఖురానా

'డ్రీమ్​ గర్ల్​' చిత్రంలో పూజా అనే పాత్ర పోషిస్తున్నాడు ఆయుష్మాన్. అన్ను కపూర్​, విజయ్​ రాజ్​, మన్​జోత్​ సింగ్​, నిధి బిస్త్​, రాజేశ్​ శర్మ, అభిషేక్​ బెనర్జీ, రాజ్​ భన్సాలీ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. రాజ్​ షాందిల్య దర్శకుడు. ఏక్తాకపూర్​ నిర్మాత. ఈ ఏడాది సెప్టెంబర్​ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

బాలీవుడ్​ ప్రముఖులు అమితాబ్​ బచ్చన్​, హేమ మాలిని, తాప్సీ పన్ను.. అభిమానులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చదవండి...ఆయనతో సహజీవనం చేయట్లేదు: భూమి

Last Updated : Sep 28, 2019, 3:46 AM IST

ABOUT THE AUTHOR

...view details