తెలంగాణ

telangana

రెబల్ పోజు.. నెట్టింట ఫ్యాన్స్ సందడి

By

Published : Feb 17, 2021, 7:24 AM IST

Updated : Feb 17, 2021, 8:29 AM IST

రెబల్​స్టార్ కృష్ణంరాజు, యంగ్ రెబల్​స్టార్ ప్రభాస్ ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్​లో కనిపిస్తే అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు కావాల్సిందే. 'రాధేశ్యామ్' చిత్రంలో వీరిద్దరూ కలిసి నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయాన్ని ధృవీకరించారు కృష్ణంరాజు.

KrishnamRaju shares adorable pic with prabhas
రెబల్ పోజు

కృష్ణంరాజు నట వారసత్వాన్ని నిలబెట్టారు ప్రభాస్‌. ఆ ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించారంటే అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు కావల్సిందే. అందుకే 'కలిసి ఎప్పుడు సినిమా చేస్తారు 'అనే ప్రశ్న వీళ్లకి తరచూ ఎదురవుతుంటుంది.

కృష్ణంరాజు, ప్రభాస్

అభిమానుల కోరిక మేరకు అప్పుడప్పుడు ప్రభాస్‌ సినిమాల్లో మెరుస్తూనే ఉంటారు కృష్ణంరాజు. 'రాధేశ్యామ్‌'లోనూ ఆయన ఓ కీలక పాత్ర చేశారని తెలుస్తోంది. ట్విట్టర్​లో కృష్ణంరాజు పంచుకున్న ఈ ఫొటోతో అది నిజమే అని స్పష్టమైంది. "ప్రభాస్‌తో కలిసి 1970 కాలాన్ని గుర్తు చేస్తా. జులై 30న 'రాధేశ్యామ్‌'తో ఆ కాలంలోకి తిరిగి వెళదాం"అని ట్వీట్‌ చేస్తూ ఒకే రకమైన పోజుతో ఉన్న ఈ ఫొటోని పంచుకున్నారు కృష్ణంరాజు.

Last Updated : Feb 17, 2021, 8:29 AM IST

ABOUT THE AUTHOR

...view details