తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఘుమఘుమలాడే రెబల్​స్టార్ చేపల పులుసు - krishnam raju prabhas radhe shyam

లాక్​డౌన్​తో ఇంట్లోనే ఉన్న సీనియర్ నటుడు కృష్ణంరాజు.. తన కుటుంబసభ్యుల కోసం ఘుమఘుమలాడే చేపల పులుసు చేసి ఆహా అనిపించారు.

ఘుమఘుమలాడే రెబల్​స్టార్ చేపల పులుసు
సీనియర్ నటుడు కృష్ణంరాజు

By

Published : Aug 29, 2020, 3:31 PM IST

వెండితెరపై నటన, డ్యాన్స్​లతో అలరించిన మెగాస్టార్ చిరంజీవి.. ఇటీవలే చేపల ఫ్రై చేసి అదరగొట్టారు. తన తల్లి అంజనీదేవితో శెభాష్ అనిపించుకున్నారు. ఇప్పుడు అదే బాటలో వెళ్లిన రెబల్​స్టార్ కృష్ణంరాజు, గరిటె తిప్పి చేపలు పులుసు ఘుమఘుమలాడించారు. ఈ వీడియో ట్వీట్ చేసిన ఆయన కుమార్తె ప్రసీద.. ప్రపంచంలోనే బెస్ట్​ ఫిష్​ను నాన్న వండారని ఆనందం వ్యక్తం చేశారు.

ఇదే విషయాన్ని ట్వీట్ చేసిన కృష్ణంరాజు.. వీకెండ్ సందర్భంగా కుటుంబం మొత్తానికి చేపల పులుసు చేసేందుకు సమయం తీసుకున్నానని రాసుకొచ్చారు.

ఈయన ప్రభాస్ 'రాధేశ్యామ్' సినిమాలో ఓ నిర్మాత ఉన్నారు. గోపీకృష్ణ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవికి ఇది థియేటర్లలోకి వచ్చే అవకాశముంది.

ABOUT THE AUTHOR

...view details