కథానాయికగా ఎన్నో సినిమాల్లో అలరించిన మేటి నటి రమ్యకృష్ణ(Ramya Krishna birthday date).. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ అదరగొడుతున్నారు. నరసింహ సినిమాలో నీలాంబరిగా పవర్‌ఫుల్ పాత్ర పోషించి ప్రేక్షకుల మెప్పుపొందారు. ఆ తర్వాత ప్రభాస్ బాహుబలి సినిమాలో వెరీ పవర్‌ఫుల్ పాత్ర శివగామితో(Bahubali Ramya Krishnan name) ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే శివగామి నటనను దర్శకుడు, భర్త కృష్ణవంశీ మెచ్చుకోలేదు. ఆ క్రెడిట్ రమ్యకృష్ణ ఒక్కరికే ఇవ్వలేదు. రమ్యకృష్ణతో పాటు రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్‌కు కూడా ఆ క్రెడిట్ దక్కుతుందని చెప్పుకొచ్చారు వంశీ.
"శివగామి(Ramya Krishna Bahubali movie) పాత్ర వెనుక ఎందరో కష్టం దాగి ఉంది. ఆ పాత్ర క్రెడిట్ విజేంద్రప్రసాద్, రాజమౌళి గారికే చెందుతుంది. వారిద్దరు 30 ఏళ్లుగా అభివృద్ధి చేసుకున్న నైపుణ్యాలకు పదును పెట్టి.. శివగామిని ప్రపంచానికి గొప్పగా చూపించారు. అయితే స్కీన్ మీద కనిపంచేవాళ్లే ఎప్పుడూ పాపులర్ అవుతారు. కానీ విషయం తెలిసిన తర్వాత వెనకాల ఉండి నడింపించిన వారికి క్రెడిట్ ఇవ్వకుండా ఉండలేం. అందుకే నువ్వు భలే చేశావ్ అని నేను రమ్యను అనలేదు" అని అలీతో సరదాగా కార్యక్రమానికి అతిథిగా వచ్చిన సందర్భంలో చెప్పారు కృష్ణవంశీ.