హీరో రానా సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ పతాకాలపై రూపొందుతున్న చిత్రం 'కృష్ణ అండ్ హిజ్ లీల'. ఈ సినిమా టీజర్‌ను తాజాగా విడుదల చేశాడు హీరో విక్టరీ వెంకటేష్. ఈ చిత్రాన్ని 'క్షణం' దర్శకుడు రవికాంత్ పేరెపు తెరకెక్కిస్తున్నాడు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా.. శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, శాలిని వడ్నికత్తి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
సమాజంలో వైరల్ అయిన రూమర్స్ ఆధారంగా ఈ కథను రాశాడు రచయిత రవికాంత్. అభినవ కృష్ణుడు లాంటి ఓ యువకుడి జీవిత గమనానికి దృశ్యరూపమిది. పలువురు అందాల భామలతో ప్రేమలో ఉన్న అతడి కథేమిటి? రాంగ్‌టైమ్ రిలేషన్‌షిప్స్ కారణంగా హీరో ఎలాంటి సమస్యల్ని ఎదుర్కొన్నాడన్నది ఆసక్తిని పంచుతుంది. శ్రీచరణ్ పాకాల స్వరాలు సమకూర్చుతున్నాడు.