రానా దగ్గుబాటి సమర్పణలో సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రం 'కృష్ణ అండ్ హిజ్ లీల'. 'గుంటూర్ టాకీస్' ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ మూవీని 'క్షణం' ఫేమ్ రవికాంత్ పేరెపు తెరకెక్కించారు. కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. తాజాగా ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్రబృందం.
ఆకట్టుకుంటోన్న 'కృష్ణ మొదటి లీల' - ఆకట్టుకుంటోన్న 'కృష్ణ మొదటి లీల'
రానా దగ్గుబాటి సమర్పణలో తెరకెక్కిన చిత్రం 'కృష్ణ అండ్ హిజ్ లీల'. ఈ సినిమాలో సిద్ధు, శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్ హీరోహీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

కృష్ణ అండ్ హిజ్ లీల
అందుకు తగ్గట్లే ప్రచారానికి పూనుకున్నారు దర్శక నిర్మాతలు. తాజాగా ఈ సినిమాలోని 'కృష్ణ మొదట ప్రేమ' పేరుతో ఓ టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో సిద్ధు ప్రేమికురాలిగా శ్రద్ధా శ్రీనాథ్ కనిపించారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ఈ సినిమాలో శ్రద్ధతో పాటు సీరత్ కపూర్, శాలిని వడ్నకత్తి హీరోయిన్లుగా నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.