తెలంగాణ

telangana

ETV Bharat / sitara

క్రిష్​ తన ఆరోపణలను నిరూపించాలి: కంగనా - వివాదం

దర్శకుడు క్రిష్ తనపై చేసిన ఆరోపణలను ఖండించింది 'క్వీన్​' నటి కంగనా రనౌత్.

క్రిష్​ తన ఆరోపణలను నిరూపించాలి: కంగనా

By

Published : Feb 2, 2019, 10:03 PM IST

'మణికర్ణిక: ది క్వీన్​ ఆఫ్​ ఝాన్సీ' చిత్ర వివాదం కొనసాగుతోంది. ఇప్పుడు నటి కంగనా రనౌత్​ దర్శకుడు క్రిష్​పై ప్రతివిమర్శలు చేసింది. చిత్రాన్ని కంగనా రనౌత్​ 'హైజాక్​' చేసిందన్న క్రిష్​ ఆరోపణలకు నటి కంగనా రనౌత్​ దీటుగా బదులిచ్చింది. క్రిష్​ తన ఆరోపణలను నిరూపించాలని రనౌత్​ సవాల్​ చేసింది.

సినిమాకు తానే పూర్తిగా దర్శకత్వం వహించానని, కంగనా ప్యాచ్​వర్క్​ మాత్రమే చేసిందని క్రిష్​ ఆరోపించారు.

"చిత్రంలో క్రిష్​కు తగిన గుర్తింపు లభించింది. నాపై ఆరోపణలు చేయడం సరికాదు. ఈ అంశంపై నిర్మాతలతోనే మాట్లాడాలి. నేను దర్శకత్వం చేశాను. చిత్రం విడుదలైంది. చివరి నిమిషంలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నాను."
-కంగనా రనౌత్​, సినీ నటి

తనపై ఫిర్యాదులు చేయాలనుకునే నటులతో కలిసి క్రిష్​ సినిమా తీయాలని కంగనా ఎద్దేవా చేసింది.

జనవరి 25న విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకు రూ. 64 కోట్ల వసూళ్లు రాబట్టింది.

ABOUT THE AUTHOR

...view details