పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా దర్శకుడు క్రిష్ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని 2022 సంక్రాంతికి విడుదల చేస్తామని ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను శివరాత్రి కానుకగా రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు.
వచ్చే సంక్రాంతికి పవన్-క్రిష్ సినిమా - krish pawankalyan movie released sankranthi 2022
క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పవన్‌కళ్యాణ్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. కాగా, ఈ చిత్రం టైటిల్, ఫస్ట్‌లుక్‌ను శివరాత్రి కానుకగా రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు.

పవన్
ఈ చిత్రం కోసం హాలీవుడ్ బృందం రంగంలోకి దిగబోతోంది. 'ఆక్వామెన్', 'వార్ క్రాఫ్ట్' తదితర చిత్రాలకు పనిచేసిన బెన్‌లాక్ నేతృత్వంలో పవన్ చిత్రం విజువల్ ఎఫెక్ట్స్ రూపొందనున్నాయి. పిరియాడికల్ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు క్రిష్. ఇందులో పవన్ సరసన బాలీవుడ్ భామ ఆడిపాడనున్నట్టు సమాచారం. ప్రతినాయకుడి పాత్ర కోసం బాలీవుడ్ నటుల్నే ఎంపిక చేయనున్నట్టు తెలిసింది.
ఇదీ చూడండి: పవర్ స్టార్, సూపర్ స్టార్ బాక్సాఫీస్ వార్!