పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ రీఎంట్రీ చిత్రం 'పింక్' రీమేక్ ఇప్పటికే సగానికిపైగా చిత్రీకరణ పూర్తి చేసుకోగా వేసవి కానుకగా మే 15న విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో పాటే క్రిష్‌తో చేస్తున్న పాన్ ఇండియా చిత్రమూ ఇప్పటికే సెట్స్‌పైకి వెళ్లింది. అన్నీ అనుకున్నట్లు కుదిరితే ఇది కూడా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఏక కాలంలోనే ఈ రెండు సినిమాలు చిత్రీకరణ జరుపుకొంటున్నాయి.
'పింక్' రీమేక్ కోసం 'వకీల్ సాబ్' అనే పేరును ఖరారు చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా పవన్ - క్రిష్‌ల చిత్ర టైటిల్‌కు సంబంధించి ఓ ఆసక్తికర పేరు బయటకొచ్చింది. ఏఎమ్ రత్నం నిర్మాణంలో రూపుదిద్దుకుంటోన్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని మొఘలాయిల కాలం నాటి కథతో తెరకెక్కిస్తున్నారు. ఇందులో పవన్ రాబిన్‌హుడ్ తరహాలో 'విరు' అన్న పేరుమోసిన దొంగగా దర్శనమివ్వనున్నాడు. ఈ పేరు మీదుగానే ఈ చిత్రానికి 'విరూపాక్షి' అన్న టైటిల్‌ను ఖరారు చేయనున్నట్లు చిత్రసీమలో గుసగుసలు వినిపిస్తున్నాయి.