తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఇంతలా ఆదరిస్తారని ఊహించలేదు: రవితేజ - క్రాక్​ మూవీ వార్తలు

కరోనా నేపథ్యంలోనూ తమ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు కథానాయకుడు రవితేజ. ఆయన నటించిన కొత్త చిత్రం 'క్రాక్​'.. సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్​హిట్​ టాక్​ అందుకుంది. ఈ సందర్భంగా బుధవారం వైజాగ్​లో విజయోత్సవ వేడుకను చిత్రబందం నిర్వహించింది. ఆ కార్యక్రమంలో అభిమానులనుద్దేశించి మాస్​ మహారాజ్​ మాట్లాడారు.

krack movie grand success celebrations
ఇంతలా ఆదరిస్తారని ఊహించలేదు: రవితేజ

By

Published : Jan 14, 2021, 7:58 AM IST

మాస్‌ మహారాజ్‌ రవితేజ, డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌ హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టింది. 'డాన్‌శీను', 'బలుపు' తర్వాత ఇప్పుడు మరోసారి వాళ్లిద్దరూ కలిసి పనిచేసిన 'క్రాక్‌' జనవరి 9న విడుదలై అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో రవితేజ సరసన శ్రుతిహాసన్‌ నటించింది. సముద్రఖని, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ తదితరులు కీలకపాత్రల్లో కనిపించారు. సంగీతం దర్శకుడు తమన్‌. బి.మధు నిర్మాత. విశాఖపట్నంలో ఈ చిత్రబృందం విజయోత్సవ సభలో రవితేజ మాట్లాడారు.

"కరోనా లాక్‌డౌన్‌ తర్వాత కూడా సినిమా చూడటానికి జనం వస్తారని మాకు నమ్మకం ఉంది. కానీ.. ఇంతా ఆదరిస్తారని ఊహించలేదు. గతంలో థియేటర్లకు ఎలా వచ్చేవారో.. ఈ సినిమాకు అలాగే వచ్చారు. ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. మంచి కిక్‌ ఇచ్చారు. కెమెరామన్‌ విష్ణు చాలా అద్భుతంగా పనిచేశాడు. ఆయనతో మళ్లీమళ్లీ చేయాలని కోరుకుంటున్నాను. తమన్‌ గురించి చెప్పాలంటే.. ఆయనతో చాలా సినిమాలు చేశాను. ఎంతమంచి సంగీతం ఇచ్చాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫైట్‌ మాస్టర్లు రామ్‌లక్ష్మణ్‌ కెరీర్‌, నా కెరీర్‌ ఒకేసారి మొదలయ్యాయి. వాళ్లిద్దరూ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. అలీ.. నేను చెన్నై నుంచి స్నేహితులం. ఇద్దరం కలిసి దాదాపు 50 సినిమాల్లో నటించాం. వరలక్ష్మి సీరియస్‌ పాత్రలు చేస్తుంది. కానీ.. సెట్లో మాత్రం అందరినీ నవ్విస్తూ ఉంటుంది. చాలా సరదా మనిషి. బుర్రా సాయిమాధవ్‌ మంచి డైలాగ్స్‌ రాశారు. సముద్రఖని.. కటారి కృష్ణగా చాలా బాగా చేశారు. ఆయనో డైరెక్టర్‌, నటుడు, విలన్‌ అన్ని విషయాల్లోనూ పర్‌ఫక్ట్‌‌. రచ్చరవి ఇక్కడి నుంచి బిజీగా అవుతాడు. నాకు ఆ నమ్మకం ఉంది. శ్రుతిహాసన్‌ కూడా బాగా చేసింది. సినిమాను ఆదరించిన అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు."

- రవితేజ, కథానాయకుడు

అంతకు ముందు డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని, నటీనటులు, చిత్రబృందం సభ్యులు మాట్లాడారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేషాదరణ లభిస్తోంది.

ఇదీ చూడండి:"అల్లుడు' అనే పదం అచ్చొచ్చింది'

ABOUT THE AUTHOR

...view details