తెలంగాణ

telangana

ETV Bharat / sitara

"క్రాక్'​ విజయంతో చిత్రపరిశ్రమకు ఊపొచ్చింది'

మాస్​ ఎంటర్​టైనర్​గా సంక్రాంతి బరిలోకి వచ్చిన 'క్రాక్​' చిత్రం.. బాక్సాఫీసు వద్ద కలెక్షన్లను కొల్లగొడుతోంది. 'క్రాక్​' విజయంతో ఇండస్ట్రీకి మళ్లీ ఊపొచ్చిందని అభిప్రాయపడ్డారు దర్శకుడు గోపీచంద్​ మలినేని. అయితే సినిమా విడుదలకు ముందు కొన్ని పరిణామాలు ఎదురయ్యాయని.. అప్పుడు చాలా మంది హీరోలు మద్దతుగా నిలిచారని ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు గుర్తు చేసుకున్నారు.

Krack movie director Gopichand Malineni Inteview
"క్రాక్'​ విజయంతో చిత్రపరిశ్రమకు ఊపొచ్చింది'

By

Published : Jan 20, 2021, 6:40 AM IST

"తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాకోసం ఎదురు చూశారు. సరైన సమయానికి సరైన సినిమాగా 'క్రాక్‌' వచ్చింది. ఈ చిత్రంతో ఇప్పటిదాకా ఉన్న గందరగోళాలన్నీ ఒక్కసారిగా తొలగిపోయి.. పరిశ్రమకు మళ్లీ ఊపొచ్చింది" అన్నారు గోపీచంద్‌ మలినేని. ఆయన దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా నటించిన చిత్రం 'క్రాక్‌'. సంక్రాంతి సందర్భంగా విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా గోపీచంద్‌ మలినేని మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...

  • హీరోలందరి అభిమానులంతా సినిమా ప్రేమికులే. వాళ్లూ వీళ్లూ అని కాకుండా, కథానాయకులందరి అభిమానులూ 'క్రాక్‌' విషయంలో స్పందించిన విధానం నన్ను కదిలించింది. పరిశ్రమ నుంచి చాలా మంది కథానాయకులు ఫోన్లు చేశారు. సినిమా విడుదల విషయంలో సమస్యలొచ్చాయని తెలియగానే మంచు మనోజ్‌, సాయి తేజ్‌ ఫోన్‌ చేసి 'నువ్వు తీసింది మంచి సినిమా, ఎప్పుడొచ్చినా ఆడుతుందం'టూ భరోసాగా మాట్లాడారు.
  • విడుదల ఆలస్యం కావడం వల్ల తొలి రోజు చాలా రెవెన్యూ కోల్పోయాం. అలాగే యాభై శాతం ప్రేక్షకులతో ప్రదర్శనలు నిర్వహించాలి. ఇలాంటి పరిస్థితుల్లోనూ రవితేజ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా 'క్రాక్‌' నిలిచిందంటే మామూలు విషయం కాదు.
  • సొంత కథ చేసుకుంటే ఆ కిక్కే వేరు. 'క్రాక్‌'తో అది మరోసారి తెలిసొచ్చింది. దీనికి కొనసాగింపుగా 'క్రాక్‌ 2' తీస్తా. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలో ఆ సినిమాను చేయబోతున్నా. మరో వారం రోజుల్లో పూర్తి వివరాలు చెబుతా.

ABOUT THE AUTHOR

...view details