కేరళ కొజికోడ్‌లో జరిగిన విమాన ప్రమాదంలో 19 మంది దుర్మరణం చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై చాలామంది విచారం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు ఇదే విషయమై పోస్టులు పెట్టారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వీరిలో అల్లు అర్జున్, అల్లరి నరేశ్, సుధీర్‌బాబు, దేవిశ్రీ ప్రసాద్, అల్లు శిరీష్, ఈషా రెబ్బా, నిధి అగర్వాల్, వరుణ్ తేజ్, రాశీఖన్నా, సుశాంత్, కీర్తి సురేశ్, సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ తదితరులు ఉన్నారు.
"కొజికోడ్‌లో జరిగిన ఈ ఘటనతో షాకయ్యా. మృతి చెందిన వారికి నా ప్రగాఢ సానుభూతి. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను" -అల్లు అర్జున్, కథానాయకుడు