తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'కౌసల్య కృష్ణమూర్తి'... ఓ మహిళా క్రికెటర్ కథ - రాజేంద్ర ప్రసాద్

ఐశ్వర్యా రాజేశ్​ హీరోయిన్​గా తెరకెక్కుతున్న 'కౌసల్య కృష్ణమూర్తి' సినిమా మోషన్​ పోస్టర్​ విడుదలైంది. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించాడు. జూన్​లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

కౌసల్య కృష్ణమూర్తి... ఓ మహిళా క్రికెటర్ కథ

By

Published : May 24, 2019, 7:40 PM IST

తమిళ నటి ఐశ్వర్యా రాజేశ్​ తెలుగులో తొలిసారి హీరోయిన్​గా నటిస్తున్న సినిమా 'కౌసల్య కృష్ణమూర్తి.. ది క్రికెటర్'. మోషన్​ పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఓ సాధారణ యువతి భారత క్రికెట్ జట్టుకు ఆడాలనే ప్రయత్నంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంది అనే నేపథ్యంతో సినిమాను తీస్తున్నారు. తమిళంలో 'కనా' పేరుతో ఈ సినిమాను తీశారు. అందులోనూ ఐశ్వర్యే కథానాయిక.

ఐశ్వర్య రాజేశ్

హీరోయిన్​ తండ్రి పాత్రలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ నటిస్తున్నారు. హీరోగా కార్తీక్ రాజు కనిపించనున్నాడు. తమిళ హీరో శివ కార్తికేయన్ కీలక పాత్ర పోషించాడు. భీమినేని శ్రీనివాసరావు​ దర్శకత్వం వహించాడు. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎ.వల్లభ నిర్మాతగా వ్యవహరించారు. జూన్​లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details