తెలంగాణ

telangana

ETV Bharat / sitara

‘కౌసల్య కృష్ణమూర్తి’ చిత్రీకరణ పూర్తి

క్రికెట్ నేపథ్యంలో వస్తున్న 'కౌసల్య కృష్ణమూర్తి.. ది క్రికెటర్' సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్న ఐశ్వర్య రాజేశ్​ ఈ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది.

‘కౌసల్య కృష్ణమూర్తి’ షూటింగ్‌ పూర్తి

By

Published : May 21, 2019, 6:00 AM IST

ఐశ్వర్య రాజేశ్​ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'కౌసల్య కృష్ణమూర్తి.. ది క్రికెటర్'. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. తండ్రీకూతుళ్ల అనుబంధం, క్రికెట్ నేపథ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రాజేంద్ర ప్రసాద్ హీరోయిన్​కు తండ్రి పాత్రలో నటించాడు. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను జూన్​లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ తమిళ హీరో శివ కార్తికేయన్‌ ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు.

"తండ్రీకూతుళ్ల మధ్య ఉండే అనుబంధం, క్రికెట్‌ నేపథ్యంలో తీసిన సినిమా ఇది. క్రికెటర్‌గా ఐశ్వర్య రాజేశ్ ఎలా విజయం సాధించింది? తండ్రికి, దేశానికి ఎంత పేరు తెచ్చింది అనేది ప్రధాన ఇతివృత్తం. ఐశ్వర్య రాజేశ్ ఈ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేస్తోంది. కార్తీక్‌ రాజు హీరోగా నటిస్తున్నాడు. రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రలో కనిపించనున్నాడు. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. జూన్‌ మూడోవారంలో సినిమా విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాం” -కేఎస్ రామారావు, చిత్ర నిర్మాత

ABOUT THE AUTHOR

...view details