తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ట్రైలర్: తండ్రి ఆనందం కోసం కూతురి పోరాటం - mithali raj

క్రికెట్​ నేపథ్య కథాంశంతో రూపొందిన 'కౌసల్య కృష్ణమూర్తి' ట్రైలర్ సోమవారం విడుదలైంది. డైలాగ్​లు ఆసక్తి రేపుతున్నాయి. ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

కౌసల్య కృష్ణమూర్తి ట్రైలర్

By

Published : Aug 19, 2019, 5:43 PM IST

Updated : Sep 27, 2019, 1:20 PM IST

భారత జట్టు ఓడిపోయిందని కన్నీళ్లు పెట్టుకున్న ఓ తండ్రికి ఆనందాన్ని కలిగించేందుకు క్రికెటర్​ అయిన ఓ కూతురి కథతో రానున్న చిత్రం 'కౌసల్య కృష్ణమూర్తి'. రాజేంద్రప్రసాద్, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రలు పోషించారు. ట్రైలర్​ను సోమవారం విడుదల చేశారు. ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

టీమిండియా క్రికెటర్ పాత్రలో ఐశ్వర్య రాజేశ్

'నీ వల్ల కాదని ఎవరైనా అంటే నువ్వు నమ్మాల్సింది వాళ్లని కాదు నిన్ను', 'ఈ లోకం గెలుస్తా అని చెపితే వినదు.. గెలిచిన వాడు చెపితే వింటుంది. నువ్వు ఏం చెప్పినా గెలిచి చెప్పు' అంటూ సాగే సంభాషణలు చిత్రంపై ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

తమిళంలో ఘనవిజయం సాధించిన 'కణ'కు ఇది రీమేక్. వ్యవసాయం, క్రికెట్​ ఇలా భిన్న నేపథ్యాలతో ఈ సినిమాను తెరకెక్కించారు. క్రియేటివ్​ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్.రామారావు నిర్మాతగా వ్యవహరించారు. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించాడు.

ఇది చదవండి: ఇందిరా గాంధీ పాత్రలో విద్యాబాలన్

Last Updated : Sep 27, 2019, 1:20 PM IST

ABOUT THE AUTHOR

...view details