తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Maa elections: 'ప్రకాశ్​రాజ్​ ఓడిపోవడానికి నాగబాబు కారణం' - maa elections nagababu

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌(maa elections 2021) 'మా' ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ ఓడిపోవడానికి నాగబాబు, నరేశ్‌ చేసిన వ్యాఖ్యలే కారణమని సీనియర్‌ నటుడు కోట శ్రీనివాసరావు అన్నారు. ప్రకాశ్‌రాజ్‌తో(maa elections prakashraj panel) పోలుస్తూ తనను కించపరిచేలా నాగబాబు మాట్లాడటం సరికాదని అన్నారు.

kota
కోటా

By

Published : Oct 18, 2021, 9:37 PM IST

Updated : Oct 18, 2021, 10:08 PM IST

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌(maa elections winner 2021) 'మా' ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ ఓడిపోవడానికి నాగబాబు, నరేశ్‌ చేసిన వ్యాఖ్యలే కారణమని సీనియర్‌ నటుడు కోట శ్రీనివాసరావు అన్నారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన 'మా' ఎన్నికల(maa elections 2021) వ్యవహారంపై మరోసారి స్పందించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశ్‌రాజ్‌కు మద్దతుగా నాగబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. నాగబాబును తాను ఎప్పుడూ ఏం అనలేదని.. అలాంటప్పుడు, తనని కించపరిచేలా ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు.

"మనస్ఫూర్తిగా చెబుతున్నా చిరంజీవి మంచి నటుడు. ఆయన నటించిన సినిమాకి జాతీయ అవార్డు రాకపోతే.. మంచి నటుడు కాదని అంటామా?. అదే మాదిరిగా ప్రకాశ్‌రాజ్‌(maa elections prakash raj panel) ఎలాంటి వ్యక్తి అనేది ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రతిసారీ 'జాతీయ అవార్డు తీసుకువచ్చా' అని చెప్పుకున్నాడు. అలా, తీసుకువచ్చినంత మాత్రాన ఎస్వీరంగారావు కంటే ఆయన గొప్ప నటుడా? ప్రకాశ్‌రాజ్‌తో నేను కొన్ని సినిమాల్లో నటించాను. ఆయన టైమ్‌కి సెట్‌కి రాడు. తోటి నటీనటులతో చక్కగా మాట్లాడడు. 'మా' అసోసియేషన్‌ అతన్ని ఇప్పటికే కొన్నిసార్లు సస్పెండ్‌ చేసింది. ఇక, ఆయనకు సపోర్ట్‌గా ఉన్న నాగబాబు ఇటీవల నాపై చేసిన వ్యాఖ్యలు బాధించాయి. ప్రకాశ్‌రాజ్‌తో(maa elections prakash raj) పోలుస్తూ నన్ను కించపరిచేలా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ నాగబాబును నేను ఏం అనలేదు. కానీ ఆయనే నన్ను విమర్శించారు. అన్నయ్య చిరంజీవి(maa elections chiranjeevi), తమ్ముడు పవన్‌కల్యాణ్‌ లేకపోతే నాగబాబు కేవలం ఒక నటుడు మాత్రమే. 'మా' సభ్యత్వానికి రాజీనామా చేయడం ఆయన వ్యక్తిగత విషయం" అని అన్నారు.

ఇదీ చూడండి: సాంగ్స్​తో రజనీ, సూర్య​.. మోహన్​లాల్​ స్టైలిష్​ లుక్​

Last Updated : Oct 18, 2021, 10:08 PM IST

ABOUT THE AUTHOR

...view details