తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Maa elections 2021: ప్రకాశ్​రాజ్​పై కోటా సంచలన వ్యాఖ్యలు - kota srinivasa rao last movie

మా ఎన్నికల్లో పాల్గొంటున్న ప్రకాశ్ రాజ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు(kota srinivasa rao last movie). అతడు ఎప్పుడూ షూటింగ్​కు టైమ్​కు వచ్చిన దాఖలు లేవని అన్నారు.

kota srinivasa rao on maa elections 2021
ప్రకాశ్​రాజ్​పై కోటా శ్రీనివాసరావు

By

Published : Oct 8, 2021, 3:00 PM IST

మా ఎన్నికలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. ఓవైపు ప్రకాశ్​రాజ్(prakash raj maa elections) ప్యానెల్, మరోవైపు మంచు విష్ణు ప్యానెల్(manchu vishnu panel)​ పోటాపోటీగా మద్దతు కూడగడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావును(kota srinivasa rao last movie) వెళ్లి కలిసింది విష్ణు ప్యానెల్. తమకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరింది. దీనిపై స్పందించిన ఆయన అందరు విష్ణుకు ఓటెయ్యాలని పిలుపునిచ్చారు.

ప్రకాశ్​రాజ్​పై కోటా సంచలన వ్యాఖ్యలు

"ప్రకాశ్​రాజ్(prakash raj maa elections) నటన గురించి నేనేం మాట్లాడను. కానీ నేషనల్ అవార్డులు, నంది అవార్డులు వచ్చాయని నేను చెప్పుకోను. అతనితో కలిసి నేను 15 సినిమాలు చేశా. ఏ సినిమాకు కూడా ఒక్కరోజు టైమ్​కు రాలేదు. ఇక్కడ లోకల్, నాన్ లోకల్ సమస్య కాదు. అందరికీ చెబుతున్నా.. విష్ణుకు ఓటు వేసి గెలిపించండి"

-కోటా శ్రీనివాస రావు, నటుడు

అక్టోబర్ 10న మా ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్ష రేసులో నిలిచిన ప్రకాశ్ రాజ్(prakash raj maa elections), మంచు విష్ణు గెలిచేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే ప్రకాశ్ రాజ్​ నాన్ లోకల్ అంటూ మంచు విష్ణు ప్యానెల్(manchu vishnu panel) మొదటి నుంచి తెలుగోడికే ఓటు వేయండంటూ ప్రచారం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో కోట శ్రీనివాస రావు(kota srinivasa rao last movie) వ్యాఖ్యలు ప్రాధ్యాన్యం సంతరించుకున్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details