ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల హవా కొనసాగుతోంది. నెటిజన్లు అనేక రకాల మీమ్స్‌తో పాటు ఒక వీడియోను మరొక ఆడియోతో జత చేస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా దక్షిణకొరియాలోని ఒక పాప్ బృందం చేసిన డాన్స్ వీడియోకు ఓ బాలీవుడ్ హిట్ సాంగ్‌ను జతపరిచిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.
హిందీ పాటకు కొరియా కుర్రాళ్ల స్టెప్పులు! - latest south korea news
ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ఎంటర్టైన్మెంట్కు సామాజిక మాధ్యమాలు వేదికగా నిలుస్తున్నాయి. తాజాగా దక్షిణకొరియాలోని ఓ పాప్ బృందం చేసిన డాన్స్ వీడియోకు ఒక బాలీవుడ్ హిట్ సాంగ్‌ను జతపరిచారు. ఇప్పుడు ఈ వీడియోకు నెట్టింట విశేష ఆదరణ లభిస్తోంది.
రెండు దశాబ్దాల క్రితం కామెడీ డ్రామాగా తెరకెక్కిన 'బివి నెం.1' చిత్రంలో 'చున్నారీ చున్నాన్' అనే గీతానికి సల్మాన్, సుస్మితాసేన్ ఆడిపాడారు. ఆ పాట ఆడియోను 'కె-పాప్ బీటీఎస్' బృందం కుర్రాళ్లు స్టెప్పులేసిన 'బాయ్ విత్ లవ్' అనే వీడియోకు జతపరచగా అది అద్భుతంగా సింక్ అయ్యింది. ఈ వీడియోను 'ఫిల్మ్ ఫర్ ఫేర్' అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వారం క్రితం విడుదల చేయగా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చాలా బాగా చేశారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
దక్షిణ కొరియా రాజధాని సియోల్ కేంద్రంగా కె-పాప్ బీటీఎస్ అనే బృందం 2010 నుంచి తమ డాన్స్ బీట్స్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది. వారి పాటలకు కోట్లాది మంది అభిమానులున్నారు.