తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బాలకృష్ణతో కొరటాల మల్టీస్టారర్‌.. మరో హీరో ఎవరంటే? - కొరటాల శివ బాలకృష్ణ సినిమా

బాలకృష్ణతో ఓ మల్టీస్టారర్​ సినిమా చేయాలని దర్శకుడు కొరటాల శివ ఓ కథ సిద్ధం చేశారట! రెండో హీరోగా మహేశ్​బాబు నటిస్తారని టాక్​ వినిపిస్తోంది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

balayya
కొరటాల

By

Published : Nov 18, 2021, 9:09 PM IST

కమర్షియల్‌ కథకు, సందేశం జోడించి సినిమాలు తెరకెక్కించడంలో కొరటాల శివ సిద్ధహస్తులు(koratala siva new movie). ప్రస్తుతం చిరంజీవి కథానాయకుడు 'ఆచార్య'కు తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారు. రామ్‌చరణ్‌ ఇందులో అతిథి పాత్రలో మెరవనున్నారు. గతంలోనూ ఎన్టీఆర్‌, మోహన్‌లాల్‌ కీలక పాత్రల్లో 'జనతా గ్యారేజ్‌'ను కొరటాల తెరకెక్కించారు. ఇప్పుడు మరో మల్టీస్టారర్‌ పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు టాలీవుడ్‌ టాక్‌. బాలకృష్ణ కోసం కొరటాల ఒక పవర్‌ఫుల్‌ కథ సిద్ధం చేశారట(balakrishna latest news). ఇందులో ఇద్దరు కథానాయకులకు అవకాశం ఉండటం వల్ల మరో ఆ హీరో ఎవరు? అన్న ఆసక్తి నెలకొంది.

ప్రస్తుతం మహేశ్‌బాబు పేరు బలంగా వినిపిస్తోంది(balakrishna and mahesh babu). ఎందుకంటే కొరటాల ఇప్పటికే ఆయనతో రెండు సినిమాలు చేశారు. దీంతో మహేశ్ ఓకే చెప్పడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి(koratala siva mahesh babu). ఒకవేళ ఆయన కాదంటే, మెగా క్యాంపు నుంచి కథానాయకుడిని ఎంచుకునే ఆలోచనలో ఉన్నారట. అయితే, దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

పైగా అటు కొరటాలకు, ఇటు బాలయ్యకు ప్రస్తుతం ఉన్న షెడ్యూల్‌ ప్రకారం ఈ ప్రాజెక్టు పట్టాలెక్కాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే బాలకృష్ణ ప్రస్తుతం గోపిచంద్‌ మలినేని, ఆ తర్వాత అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో సినిమాలు చేయనున్నారు. మరోవైపు కొరటాల టఆచార్యటను పూర్తి చేసి, ఎన్టీఆర్‌తో సినిమా చేయాల్సి ఉంది.

ఇదీ చూడండి:Balakrishna unstoppable: బాలయ్య టాక్ షోలో డార్లింగ్ హీరో!

ABOUT THE AUTHOR

...view details