తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆస్కార్​లో మరోసారి నిరాశ.. రేస్​ నుంచి 'కూళంగల్​' ఔట్ - టాలీవుడ్​ వార్తలు తాజా

Koozhangal Movie Oscar: ఇటీవల భారత్​ తరపున ఆస్కార్​కు ఎంపికైన తమిళ చిత్రం 'కూళంగల్' ఈ రేస్​ నుంచి తప్పుకొంది. కాగా, మన దేశం తరఫున 'రైటింగ్ విత్​ ఫైర్​' అనే డాక్యుమెంటరీ షార్ట్​ లిస్ట్​ అయింది.

oscar race
ఆస్కార్​

By

Published : Dec 22, 2021, 11:19 AM IST

Updated : Dec 22, 2021, 11:37 AM IST

Koozhangal Movie Oscar: ప్రముఖ కోలీవుడ్​ దర్శకుడు విజ్ఞేశ్​ శివన్​-లేడీ సూపర్​స్టార్​ నయనతార సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'కూళంగల్​'. పీఎస్​ వినోద్​ రాజ్​ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల ప్రతిష్ఠాత్మక ఆస్కార్​ అవార్డులకు విదేశీ భాషా చిత్రాల కేటగిరిలో భారత్​ నుంచి అధికారికంగా ఎంపికైంది. దీనిపై హర్షం వ్యక్తం చేసిన చిత్రబృందానికి ఇప్పుడు నిరాశే మిగిలింది. నిర్వాహకులు బుధవారం ప్రకటించిన టాప్-15 కేటగిరీలో ఈ సినిమా చోటు సంపాదించలేకపోయింది.

కాగా.. భారత్​ తరపున 'రైటింగ్ విత్​ ఫైర్​' అనే డాక్యుమెంటరీ ఈ షార్ట్​లిస్ట్​కు ఎంపికైంది. ఈ చిత్రాన్ని రింతు థామస్​-సుశ్మిత్​ ఘోష్​ తెరక్కించారు.

భారత్​ తరఫున అధికారిక ఎంట్రీ కోసం 14 సినిమాలు పోటీ పడ్డాయి. అందులో హిందీ చిత్రాలు 'షేర్నీ', 'సర్దార్​ ఉద్ధమ్'. 'మండేలా'(తమిళం), 'నాయాట్టు'(మలయాళం) పోటీ పడ్డాయి. ఈ చిత్రాలను దాటి మన దేశం తరఫున 'కూళంగల్'​ ఆస్కార్​కు నామినేట్​ అవ్వడం విశేషం. వచ్చే ఏడాది మార్చి 27న ఆస్కార్​ అవార్డులు ప్రదానం చేయనున్నారు.

ఇదీ చూడండి :'పుష్ప' టీమ్​కు అక్షయ్​ కంగ్రాట్స్​.. రిలీజ్​ డేట్​తో దుల్కర్​ సల్మాన్​

Last Updated : Dec 22, 2021, 11:37 AM IST

ABOUT THE AUTHOR

...view details