తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'వచ్చే ఏడాది నిహారిక.. ఆ తర్వాత వరుణ్​ పెళ్లి'​ - నిహారిక పెళ్లిపై స్పష్ణతనిచ్చిన నాగబాబు

మెగా కుటుంబం నుంచి వచ్చిన తొలి హీరోయిన్​ నిహారిక. వచ్చే ఏడాది ఆమె పెళ్లి పీటలు ఎక్కబోతుందని తండ్రి​ నాగబాబు తాజాగా వెల్లడించారు. ఆ తర్వాత వరుణ్​తేజ్​ పెళ్లి చేయాలనే ఆలోచన ఉందని ఆయన తెలిపారు.

Konidela Niharika will going to get marry next year?
'వచ్చే ఏడాది నిహారిక.. ఆ తర్వాత వరుణ్​తేజ్'​

By

Published : May 13, 2020, 3:40 PM IST

మెగాస్టార్‌ చిరంజీవి తమ్ముడు నాగబాబుకు ఎలాంటి విషయాన్నైనా అభిమానులతో పంచుకోవడం అలవాటు. అవి రాజకీయాలైనా, సినిమాలైనా, ఇంకే ఇతర విషయాలైనా సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేస్తుంటారు. తాజాగా ఆయన తన కుమారుడు, కుమార్తె వివాహాల గురించి ప్రస్తావించారు.

తండ్రి నాగబాబుతో నిహారిక

"అమ్మాయి నిహారికకు పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నాం. సంబంధాలు చూస్తున్నాం. వచ్చే ఏడాదిలోనే ఆమెను ఒక ఇంటిదాన్ని చేయాలనే ఆలోచన ఉంది. ఆ తర్వాత మిగిలింది వరుణ్‌ తేజ్‌. ఈ పెళ్లైన తర్వాత మంచి అమ్మాయిని చూసి చేసే అవకాశం ఉంది. అయితే అది 2022లో చేయాలనే ఆలోచనా ఉంది. ఏ తండ్రికైనా తన బాధ్యతలను నెరవేర్చడం ముఖ్యం. అందరిలాగే నాక్కూడ అమ్మాయి నిహారికను వైద్యురాలిగా, అబ్బాయిని వరుణ్‌తేజ్‌ని ఐపీఎస్‌ ఆఫీసర్‌గా చూడాలని ఓ కోరిక ఉండేది. కానీ తల్లితండ్రులు సాధించలేని కలలను తన వారసులపై రుద్ద కూడదనేది నా అభిప్రాయం. ప్రతి ఒక్కరికి జీవితంలో ఏం చేస్తే బాగుంటుంది అనేది వారికి తెలిసి ఉంటుంది. అలా ఎవరికి ఇష్టమైన మార్గంలో వారు రాణిస్తే ఆ సంతృప్తే వేరుగా ఉంటుంది. అందుకే మా పిల్లల విషయంలో వారి అభిప్రాయాలను గౌరవిస్తూ సహకారం అందిస్తాను" అంటూ తన మనసులోని మాట చెప్పేశారు నాగబాబు.

ఇదీ చూడండి..'తేరే బినా..'లో సల్మాన్​ కుమార్తె ఎవరో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details