తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రభాస్​తో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నిహారిక - నిహారిక ప్రభాస్​ న్యూస్​

యంగ్​ రెబల్​స్టార్​ ప్రభాస్​తో వివాహం అంటూ వస్తోన్న వార్తలపై తాజాగా స్పందించింది కొణిదెల నిహారిక. అవన్నీ ఊహాగానాలని కొట్టిపారేసింది. ఇన్​స్టాలో అభిమానులతో తాజాగా ఏర్పాటు చేసిన లైవ్​ సెషన్​లో ఈ విషయాన్ని వెల్లడించింది.

Konidela Niharika Clarify about her marriage romours with prabhas
ప్రభాస్​తో పెళ్లి రూమర్లపై స్పందించిన నిహారిక!

By

Published : Apr 24, 2020, 1:04 PM IST

సినీ తారల పెళ్లిళ్లపై ఊహాగానాలు సహజం. వారిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ అనేక వార్తలు వస్తుంటాయి. అలాగే మెగా హీరోయిన్ నిహారికకు అలాంటి అనుభవమే ఎదురైంది. కొంతకాలంగా ఈమెకు ప్రభాస్​తో పెళ్లంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై స్పందించింది నిహారిక. ఆమె ఇటీవలే ఇన్​స్టాలో అభిమానులతో ముచ్చటించింది. అందులో ఓ నెటిజన్​ ప్రభాస్​తో పెళ్లి విషయాన్ని ప్రస్తావించగా అందులో నిజం లేదని స్పష్టం చేసింది.

మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్​గా పరిచయమైన ఒకే ఒక్క అమ్మాయి నిహారిక. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె అయిన నిహారిక 2016లో 'ఒక మనసు' సినిమాతో హీరోయిన్​గా వెండితెరకు పరిచయమైంది. ఇటీవలే చిరంజీవి సినిమా 'సైరా'లో అతిథి పాత్రలో మెరిసింది.

ఇదీ చూడండి.. బాలీవుడ్​ నటి కంగన​పై పోలీసులకు ఫిర్యాదు!

ABOUT THE AUTHOR

...view details