తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మహేశ్​ కోసం 'కొండారెడ్డి బురుజు' మరోసారి..! - kondareddy buruju set for sarileru neekevvaru cinema

'సరిలేరు నీకెవ్వరు' సినిమా కోసం 'కొండారెడ్డి బురుజు' సెట్​ను మరోసారి రూపొందిస్తున్నారు. ఆ ఫొటోలు ప్రస్తుతం వైరల్​ అవుతున్నాయి.

హీరో మహేశ్​బాబు

By

Published : Aug 25, 2019, 9:27 PM IST

Updated : Sep 28, 2019, 6:19 AM IST

సూపర్​స్టార్ మహేశ్​బాబు హీరోగా నటిస్తున్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. కశ్మీర్​లో తొలి షెడ్యూల్​ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. హైదరాబాద్​లోని అన్నపూర్ణ స్టూడియోస్​లో వేసిన ట్రైన్​ సెట్​లో షూటింగ్​ జరుపుకుంటోంది.

'ఒక్కడు'లో కొండారెడ్డి బురుజు దగ్గర మహేశ్​బాబు చేసిన సందడిని.. మరోసారి పునరావృతం చేసేందుకు 'సరిలేరు నీకెవ్వరు' చిత్రబృందం సిద్ధమవుతోంది. ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్​ సిటీలో ఆ సెట్​ను రూపొందిస్తున్నారు. ఆ ఫొటోలు నెట్టింట వైరల్​ అవుతున్నాయి.

రామోజీ ఫిల్మ్​ సిటీలో సిద్ధమవుతున్న కొండారెడ్డి బురుజు సెట్

ఈ సినిమాలో హీరోయిన్​గా రష్మిక మందణ్న కనిపించనుంది. నటి విజయశాంతి ఓ కీలక పాత్ర పోషిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: కశ్మీర్​లో మహేశ్​​​బాబు క్రికెట్​ ఆడిన వేళ...

Last Updated : Sep 28, 2019, 6:19 AM IST

ABOUT THE AUTHOR

...view details