"సినిమాకి(kondapolam movie release date) కావల్సిన ప్రథమ ముడిపదార్థం కథ. మనకున్నన్ని కథలు ఎక్కడా లేవు. కానీ గొప్ప కథలు రావడం లేదని దర్శకులమంతా కూర్చుని ఆలోచించాం. అప్పుడు రచయితలకి పారితోషికం, పేరు, గౌరవం, ఆహ్వానించే తీరు గురించి చాలా అనుకున్నాం. రచయితను ఉన్నత స్థానంలో ఉంచాలని కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. అందులో మొదటి భాగంగా... మా దర్శకులందరి నుంచీ మేం చేసిన తొలి ప్రయత్నమే ఈ సినిమా" అని అన్నారు దర్శకుడు క్రిష్(kondapolam movie director). ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కొండపొలం'. వైష్ణవ్‌తేజ్, రకుల్‌ప్రీత్ సింగ్(vaishnav tej rakul preet singh) జంటగా నటించారు. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. కీరవాణి స్వరకర్త. ఈ చిత్రం ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ముందస్తు విడుదల వేడుక జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన హరీష్‌శంకర్ మాట్లాడుతూ "చాలా కాలమైంది ఒక నవలా రచయిత పేరు సినిమా పోస్టర్‌పై చూసి. సాహిత్యాన్ని ముత్యాల్లాగా తలపై పెట్టుకుని పరిశ్రమకి తీసుకొస్తాడు క్రిష్. తన సినిమా వస్తుందంటే తెలియని ఆసక్తి నెలకొంటుంది" అన్నారు.
క్రిష్(kondapolam movie director) మాట్లాడుతూ "ఈ సినిమా విజయం అనేది తెలుగు సాహిత్యానికి, తెలుగు సినిమాకి, సమాజానికి అవసరం. తెలుగు దర్శకుడిగా చెబుతున్నా... తెలుగువారు గర్వపడేలా చేశా. వైష్ణవ్‌ను 'ఉప్పెన'తో ఒక మెట్టు ఎక్కించాడు దర్శకుడు బుచ్చిబాబు. దానికి పైమెట్టు నేను ఈ సినిమాతో ఎక్కించా. రకుల్ పక్కాగా యాస పలుకుతూ, అడవంత గొప్పదైన ఓబు పాత్రలో నటించింది" అన్నారు.