తమిళ కథానాయకుడు విజయ్‌సేతుపతి.. తన తర్వాతి సినిమా విడుదలపై అభిమానులకు స్పష్టతనిచ్చాడు. ఎస్పీ జననాథన్ దర్శకత్వంలో వస్తున్న 'లాభం' సినిమాలో విజయ్ ప్రధానపాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకొని ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఇది థియేటర్లలో విడుదలవుతుందా లేక ఓటీటీలోనా..? అని కోలీవుడ్‌లో బాగానే చర్చ సాగింది. అందుకు బేరసారాలు జరిగినట్లు జోరుగా వార్తలు కూడా వచ్చాయి. అయితే.. హీరో విజయ్ ఈ చర్చకు తెరదించాడు. సినిమాను ఓటీటీలో విడుదల చెయ్యబోమని.. థియేటర్లోనే ప్రేక్షకుల ముందుకు వస్తామని ప్రకటించాడు. ఈ విషయాన్ని నేరుగా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు.
ఓటీటీలో కాదు.. థియేటర్లలోనే 'లాభం' - థియేటర్లోనే లాభం సినిమా
కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి కొత్త చిత్రం 'లాభం' ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఊహాగానాలపై స్పందించిన విజయ్.. తన చిత్రం థియేటర్లలోనే విడుదలవుతుందని స్పష్టతనిచ్చారు.
కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ వాయిదా పడటం వల్ల విడుదల తేదీని కూడా మార్చుకోవాల్సి వచ్చింది. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. థియేటర్లలోనే విడుదల చేస్తామని విజయ్ తీపి కబురు చెప్పడం వల్ల అభిమానులు ఖుషీ అవుతున్నారు. కాగా.. చిత్రబృందం ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ చిత్రంలో విజయ్ సరసన శ్రుతిహాసన్ కనిపించనుంది. జాతీయ అవార్డు విజేత డైరెక్టర్ జననాథన్‌తో కలిసి విజయ్ చేస్తున్న రెండో సినిమా ఇది. మరోవైపు దాదాపు మూడు సంవత్సరాల విరామం తర్వాత శ్రుతిహాసన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ ఇటీవల ధర్మపురి, కృష్ణగిరి పరిసర ప్రాంతాల్లో జరిగింది.