తెలంగాణ

telangana

ETV Bharat / sitara

శంకర్​ దర్శకత్వంలో విజయ్ మరోసారి? - స్నేహితులు విజయ్-శంకర్

కోలీవుడ్​ హీరో విజయ్.. ప్రముఖ దర్శకుడు శంకర్​తో త్వరలో కలిసి పనిచేయనున్నాడట. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని, త్వరలో అధికారిక ప్రకటన రానుందని సమాచారం.

శంకర్​ దర్శకత్వంలో విజయ్ మరోసారి?
హీరో విజయ్

By

Published : Dec 10, 2019, 5:11 AM IST

తలపతి విజయ్ కెరీర్ ప్రస్తుతం జెట్​ స్పీడ్​లో వెళుతోంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇటీవలే వచ్చిన విజల్(బిగిల్) ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. తర్వాతి చిత్రం లోకేశ్ కనకరాజ్​తో చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్​ జరుపుకుంటోంది. దీని తర్వాత ఈ కథానాయకుడు శంకర్​ దర్శకత్వంలో నటించనున్నాడట. ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఇంతకు ముందే వీరిద్దరి కాంబినేషన్​లో 'స్నేహితుడు'(త్రీ ఇడియట్స్ రీమేక్) వచ్చింది.

దర్శకుడు శంకర్- హీరో విజయ్

విజయ్ నటిస్తున్న ప్రస్తుత చిత్రంలో విజయ్ సేతుపతి విలన్​గా కనిపించనున్నాడు. ఇందులో కాలేజ్ ఫ్రొఫెసర్​, మాఫియా డాన్​ పాత్రల్ని పోషిస్తున్నాడు విజయ్.

శంకర్.. 'భారతీయుడు 2'తో బిజీగా ఉన్నాడు. కమల్​హాసన్ హీరోగా నటిస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇది చదవండి: షూటింగ్ జరుగుతుండగానే విజయ్ 64వ సినిమా రికార్డుల వేట

ABOUT THE AUTHOR

...view details