భారత్‌లో రూపొందుతోన్న ఎన్నో సినిమాలు హాలీవుడ్ చిత్రాలకు పోటీగా నిలిచాయి. ఇంగ్లీష్ సినిమాలకు పోటీనిచ్చే విధంగా మన దర్శకులు అలాంటి సాంకేతిక, కథతో చిత్రపరిశ్రమను గర్వించేలా చేస్తున్నారు. రాజమౌళి, శంకర్ వంటి విలక్షణ దర్శకులు ప్రపంచం మన సినీపరిశ్రమ వైపు తొంగిచూసేలా సినిమాలను తెరకెక్కిస్తున్నారు. కానీ, ఈ డైరెక్టర్లు ఎప్పుడూ హాలీవుడ్లో పనిచేయడానికి మాత్రం ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలో హాలీవుడ్లో ఓ సినిమా రూపొందించేందుకు ఓ ప్రముఖ దర్శకుడు రంగం సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం.
హాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న మురుగదాస్!
విభిన్న చిత్రాల దర్శకుడు ఏఆర్ మురుగదాస్.. హాలీవుడ్ అరంగేట్రం చేయనున్నారని సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ వాల్ట్డిస్నీతో కలిసి యాక్షన్ కథాంశంతో చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
హాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న మురుగదాస్!
తమిళ, తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన దర్శకుడు ఏఆర్ మురుగదాస్ త్వరలోనే హాలీవుడ్లో ఓ సినిమాను తెరకెక్కించనున్నారని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ వాల్ట్డిస్నీతో మురుగదాస్ ఒప్పందం కుదుర్చుకున్నారని సమాచారం. యాక్షన్ కథాంశంతో చిత్రాన్ని రూపొందిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఎదురుచూడాల్సిందే.
ఇదీ చూడండి:బరువు తగ్గినందుకు గిఫ్ట్‌గా లగ్జరీ కారు
Last Updated : Dec 1, 2020, 7:06 PM IST