తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'పుష్ప'లో విలన్​గా కోలీవుడ్​ హీరో! - సునీల్

అల్లు అర్జున్​తో తమిళ నటుడు ఆర్య మరోసారి నటించనున్నట్లు తెలుస్తోతంది. ఇప్పటికే 'వరుడు'లో వీరిద్దరూ కలిసి పనిచేశారు.

kollywood arya in talks with pushpa team?
పుష్పలో విలన్​గా కోలీవుడ్​ హీరో!

By

Published : Dec 28, 2020, 8:21 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప'లో తమిళ హీరో ఆర్య కూడా నటించనున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు విలన్లలో ప్రధాన ప్రతినాయకుడిగా ఇతడిని ఎంపిక చేసినట్లు సమాచారం. అంతకుముందు ఈ రోల్​ కోసం విజయ్​ సేతుపతిని సంప్రదించారు కానీ డేట్స్​ ఖాళీ లేనందున అతడు తప్పుకున్నారట.

మరో ఇద్దరు విలన్లుగా సునీల్​, కన్నడ నటుడు ధనంజయ ఇప్పటికే ఖరారయ్యారట. వీళ్లిద్దరినీ నిర్దేశించే పవర్​ఫుల్​ ఫారెస్ట్ ఆఫీసర్​గా ఆర్య కనిపించనున్నట్లు సమాచారం.

'పుష్ప' తర్వాతి షెడ్యూల్ జనవరిలో మొదలుకానుంది. ఎర్రచందనం స్మగ్లింగ్​ నేపథ్య కథతో సినిమా తీస్తున్నారు దర్శకుడు సుకుమార్. రష్మిక హీరోయిన్​గా నటిస్తోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో దీనిని రూపొందిస్తున్నారు.

ఇదీ చూడండి:బాలీవుడ్​ స్టార్స్ సోషల్​ మీడియా ఖాతాలు హ్యాక్​

ABOUT THE AUTHOR

...view details