అలనాటి నటి రాధ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోయిన్‌గా కొన్ని చిత్రాల్లో నటించారు నటి కార్తీకా నాయర్(Karthika Nair). తెలుగులో తెరకెక్కిన 'జోష్'(Josh)తో హీరోయిన్‌గా వెండితెరపై మెరిసిన ఈ బ్యూటీ త్వరలోనే నటనకు గుడ్‌బై చెప్పనున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 2009 నుంచి వరుసగా దక్షిణాది చిత్రాల్లో నటిస్తున్నప్పటికీ అనుకున్నంత స్థాయిలో గుర్తింపు రాకపోవడం వల్లనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
అంతేకాకుండా కార్తీక గత కొంతకాలం క్రితం వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో తన వ్యాపార సంస్థను మరింత అభివృద్ధి చేయాలనే భావనలో ఉన్నారని టాక్. దీంతో ఆమె నటనకు స్వస్తి చెప్పనున్నారంటూ నెటిజన్లు అనుకుంటున్నారు.