వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే బిగ్బాస్ ఫేం, తమిళ నటి మీరా మిథున్ మరోసారి విమర్శలకు గురైంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఓ సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఓ వీడియో పోస్ట్ చేయడమే ఇందుకు కారణం.
ఓ సామాజిక వర్గంపై పలు ఆరోపణలు చేస్తూ.. ఆ వర్గానికి చెందిన దర్శకులు, నటులు, నటీమణులు తమిళ చిత్ర పరిశ్రమ నుంచి వైదొలగాలంటూ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియో వైరల్గా మారింది. దీంతో నెటిజన్లు ఆమెపై ఆగ్రవహం వ్యక్తం చేస్తూ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.