బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు.. తనదైన శైలి వినోదంతో టాలీవుడ్లో మంచి గుర్తింపు సంపాందించిన నటుడు. 'హృదయ కాలేయం'తో హీరోగా పరిచయమై తానేంటో నిరూపించుకున్నాడు.
4 ఏళ్ల తర్వాత ముగ్గురు భార్యలతో వస్తున్న సంపూ - tollywood
టాలీవుడ్ నటుడు సంపూర్ణేష్ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం కొబ్బరిమట్ట. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజాగా 'కొబ్బరిమట్ట' అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు సంపూ. 'హృదయ కాలేయం' చిత్రాన్ని తీసిన నిర్మాతలే ఈ సినిమానూ రూపొందించారు. మొదటి సినిమా 2014లో విడుదలై సంచలనం సృష్టించగా 2015లో 'కొబ్బరిమట్ట' మొదలుపెట్టారు.
ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవగా.. షూటింగ్‌ను ఇన్నాళ్లకు పూర్తిచేశారు. అంటే దాదాపు నాలుగేళ్లన్నమాట. ఈ రోజు 'కొబ్బరిమట్ట' సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ సభ్యులు. ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవీ చూడండి.. బాక్సాఫీస్ వద్ద కరణ్‌తో కంగనా ఫైట్..!