తెలంగాణ

telangana

ETV Bharat / sitara

దర్శక దిగ్గజానికి 'కొబ్బరిమట్ట' టీమ్​ ఘన నివాళి - కొబ్బరి మట్ట

బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు హీరోగా నటించిన 'కొబ్బరి మట్ట'ను దివంగత దర్శకుడు ఇ.వి.వి సత్యనారాయణకు అంకితం చేసింది చిత్ర బృందం.

సంపూర్ణేశ్ బాబు

By

Published : Aug 4, 2019, 7:19 PM IST

'హృదయ కాలేయం'తో ప్రేక్షకుల్ని అలరించిన సంపూర్ణేశ్ బాబు త్వరలో 'కొబ్బరి మట్ట'తో రానున్నాడు. నవతరం హాస్యానికి పట్టం కట్టిన దర్శకుడు ఇ.వి.వి సత్యనారాయణకు ఈ చిత్రాన్ని అంకితమిస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు.

ట్రైలర్​లో సంపూ చెప్పిన మూడున్నర నిమిషాల డైలాగ్లిమ్కా బుక్​లో స్థానం సంపాదించింది. ఈ నాన్ స్టాప్ ట్రైలర్​కు వీక్షకుల నుంచి విశేష స్పందన వస్తోందని చెప్పింది చిత్రబృందం.

పాపారాయుడు, పెద‌రాయుడు, ఆండ్రాయుడు అనే మూడు పాత్రల్లో కనిపించనున్నాడు సంపూ. ఈ సినిమాకు స్టీవెన్​ శంకర్ కథ అందించగా సాయి రాజేశ్ నిర్మించారు. రూపక్ రొనాల్డ్ సన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది సంగతి: వెంకయ్య కోసం 'బాట్లా హౌస్' స్పెషల్ షో

ABOUT THE AUTHOR

...view details