తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నటిపై కత్తితో దాడి చేసిన ఫేస్​బుక్ స్నేహితుడు - మాల్వి మల్హోత్రా తాజా వార్తలు

బాలీవుడ్ నటి మాల్వి మల్హోత్రాపై యోగేశ్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలు కావడం వల్ల ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Knife attack on actress Malvi Malhotra in mumbai
నటిపై కత్తితో దాడి చేసి ఫేస్​బుక్ స్నేహితుడు

By

Published : Oct 27, 2020, 12:29 PM IST

బాలీవుడ్ నటి మాల్వి మల్హోత్రాపై ముంబయిలో కత్తి దాడి జరిగింది. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో మాల్వి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా యోగేశ్ కుమార్ మహిపాల్ అనే వ్యక్తి కత్తితో పొడిచాడు. తీవ్ర గాయాలైన ఆమె ప్రస్తుతం కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

మాల్వి మల్హోత్రా

యోగేశ్​, మాల్వి 2019 నుంచి ఫేస్ బుక్​లో ఫ్రెండ్స్​గా ఉన్నారు. అప్పటి నుంచి మూడు, నాలుగు సార్లు కలుసుకున్నారు. ఆమెను కలిసినప్పటి నుంచి తనను ప్రేమించమంటూ యోగేశ్ వెంబడిపడుతున్నట్లు సమాచారం. పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం చేసినట్లు తెలుస్తోంది. అయితే మాల్వి ఇందుకు నిరాకరించగా గత కొన్ని రోజులుగా ఆమెను ఫోన్లో ఇబ్బందిపెడుతున్నాడు.

యోగేశ్

ఈ క్రమంలోనే సోమవారం మాల్వి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఆడి కారులో వచ్చిన యోగేశ్ ఆమెను అడ్డగించాడు. ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. మాల్వి అందుకు నిరాకరించడం వల్ల కత్తితో పొత్తి కడుపులో పొడిచాడు. తర్వాత వెన్ను, భుజంపైనా కత్తిపోట్లతో విరుచుకుపడ్డాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న యోగేశ్​పై వెర్సోవా పోలీస్ స్టేషల్​లో కేసు నమోదైంది.

ABOUT THE AUTHOR

...view details