తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అతడిని మరో సుశాంత్​ కానివ్వకండి: కంగన - కంగనా రనౌత్​ కరణ్​ జోహార్​

బాలీవుడ్​ నిర్మాత కరణ్​ జోహార్​ నిర్మిస్తున్న కొత్త చిత్రం 'దోస్తానా 2' నుంచి హీరో కార్తిక్​ ఆర్యన్​ తప్పుకున్నట్లు తెలుస్తోంది. నిర్మాతతో భేదాభిప్రాయాల కారణంగా హీరో​ను తప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇదే విషయంపై నటి కంగనా రనౌత్​ ఘాటుగా స్పందించారు.

Kangana says 'don't go after him like Sushant'
అతడిని మరో సుశాంత్​లా కానివ్వకండి: కంగన

By

Published : Apr 17, 2021, 11:12 AM IST

ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ 2019లో 'దోస్తానా2' నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. కోలిన్‌ డికున్హా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇందులో జాన్వీ కపూర్‌, కార్తిక్‌ ఆర్యన్‌, లక్ష్య లల్వాని నటించాల్సింది. 2019 నవంబర్లో‌నే సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఆ తర్వాత కరోనా కారణంగా షూటింగ్‌ వాయిదా పడింది.

అయితే ఈ చిత్రకథకు సంబంధించి హీరో కార్తీక్‌ కొన్ని మార్పులు చేయాలని సూచించారట. అందుకు నిర్మాత కరణ్‌జోహార్‌ కూడా అంగీకారం తెలిపారట. కానీ కార్తిక్‌ కాల్షీట్స్ సరిగ్గా కేటాయించకపోవడం వల్ల అతని స్థానంలో మరొకరిని తీసుకోనున్నారనే వార్తలు వస్తున్నాయి. కానీ, వారిద్దరి మధ్య భేదాభిప్రాయాల వల్లే ఈ చిత్రం నుంచి కార్తిక్​ ఆర్యన్​ తప్పించినట్లు బాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ విషయంపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్​ ఘాటుగా స్పందించారు. నెపోటిజం గ్యాంగ్​ మరో సుశాంత్​ లాగా కార్తిక్​ ఆర్యన్​ను చేయోద్దని డిమాండ్​ చేశారు.

"కార్తిక్​కు ఎవరి మద్దతు లేకుండా తనంతట తానుగా చిత్రసీమకు వచ్చాడు. స్వయంగా ఎదుగుతున్నాడు. జో, నెపోటిజం గ్యాంగ్​కు నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా. సుశాంత్​లాగా అతను బలవంతంగా ఉరి తీసుకునే స్థాయికి పరిస్థితిని తీసుకురాకుండి. అతడిని ఒంటరిగా వదిలేయండి".

- కంగనా రనౌత్​, కథానాయిక

మరి కార్తిక్‌ స్థానంలో హీరోగా ఎవర్ని ఎంపిక చేస్తారో తెలియాల్సిఉంది. ఈ మధ్యే కార్తిక్‌ కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. ఆయన నటించిన 'ధమాకా' చిత్రం త్వరలోనే ఓటీటీలో విడుదలకానుంది. ప్రస్తుతం కార్తిక్‌ - అనీష్‌ బజ్మీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హర్రర్ చిత్రం 'భూల్‌ భులయ్య2'లో నటిస్తున్నారు. ఇందులో కియారా అడ్వాణీ కథానాయిక.

ఇదీ చూడండి:ఓటీటీ విడుదలకు సిద్ధమైన 'సైనా'

ABOUT THE AUTHOR

...view details