తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆ వార్తలు మాకు తలనొప్పి తెప్పిస్తాయి' - గిల్టీ వెబ్​ సిరీస్​ చిత్రం

'మీటూ' నేపథ్యంలో తెరకెక్కిన వెబ్​ సిరీస్​ 'గిల్టీ' నేడు విడుదల కానుంది. కియారా అడ్వాణీ ప్రధాన పాత్రలో నటించింది. ఈ సందర్భంగా సినిమా గురించి పలు విషయాలను చెప్పుకొచ్చిందీ భామ.

kiyara
కియారా అడ్వాణీ

By

Published : Mar 7, 2020, 6:46 AM IST

రెండేళ్ల కిత్రం ప్రపంచవ్యాప్తంగా మొదలైన మీటూ ఉద్యమం సినీ రంగంతో పాటు మరికొన్ని రంగాలకు పాకింది. బాలీవుడ్‌లో మీటూకు వ్యతిరేకంగా నాంది పలికింది మాత్రం నటి తనూశ్రీ దత్తా. 'మీటూ' సమస్యని ఆధారంగా చేసుకొని తెరకెక్కిన వెబ్‌ సిరీస్‌ చిత్రం 'గిల్టీ'. కియారా అడ్వాణీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి రుచి నారియన్‌ దర్శకత్వం వహించింది. కరణ్‌ జోహార్‌ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం విడుదలకు ముందు ఓ ముఖాముఖీ సమావేశంలో కియారా పలు విషయాలను పంచుకుంది.

"కొన్నిసార్లు 'మీటూ' గురించి మనకు జరిగిన కొన్నింటిని, విన్న వాటిని చెప్తాం. కానీ అదే విషయాన్ని వాళ్లు వేరొక విధంగా రాస్తుంటారు. అవి పరోక్షంగా మాకు తలనొప్పులు తెచ్చిపెడుతుంటాయి. 'గిల్టీ'లాంటి సినిమా చేశాను. మళ్లీ దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఉద్దేశ్యం ఏమిటి అనేది చూసేవాళ్లకు తెలుసు. ఎందుకు ముందే అన్ని విషయాలు చెప్పాలి? ప్రతి రంగంలోను సమస్య ఉంటుంది. అది చిత్రసీమలోను ఉంటోంది."

-కియారా అడ్వాణీ, కథానాయిక.

ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా గడుపుతోంది కియారా.

ఇదీ చూడండి : అంచనాలు పెంచుతోన్న 'మరక్కార్‌' ట్రైలర్‌

ABOUT THE AUTHOR

...view details