బాలీవుడ్ నటి కియారా అడ్వాణీ వెండితెరపైకి వచ్చి ఆరేళ్లు దాటిపోయింది. తన తొలి చిత్రం 'ఫగ్లీ'తో వెండితెర అరంగేట్రం చేసిన కియారా ఈ మధ్య విడుదలైన 'ఇందూ కి జవానీ' సినిమాతో ప్రేక్షకులను అలరించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ.. తన కెరీర్ గురించి పలు ఆసక్తిర విషయాలను పంచుకుంది.
"నేను కెరీర్ పరంగా చాలా సంతోషంగా ఉన్నా. ఇంకా సాధించాల్సిన పనులు చాలా ఉన్నాయి. నేను చాలా మంది దర్శకులతో కలిసి పనిచేయాలనుకుంటున్నా. ఆ జాబితా నా దగ్గర ఉంది. నేను ఎలాంటి పాత్రలు చేయగలనో, ఏ రకమైన పాత్రలు పోషించగలనో నాకు తెలుసు. కొంతమంది అడిగినట్లు తక్కువ సమయంలోనే ఇంత పేరు, విజయాలు సాధించారా? అని అడిగితే చెప్పలేను. కొన్ని పాత్రలు నేను చేయగలనని నమ్మారు. అందరి సహకారంతో ఎలాంటి పాత్రలైన చేయగలుగుతున్నా."