తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఒక్క ముద్దు కోసం 37 టేకులు..! - కార్తీక్ ఆర్యన్

బాలీవుడ్ దర్శకుడు సుభాష్ ఘాయ్ తాను దర్శకత్వం వహించిన కాంచి చిత్రంలో ఓ ముద్దు సీన్ కోసం హీరోహీరోయిన్ల చేత 37 టేకులు చేయించాడంట.  ఇందులో నటించిన కార్తీక్ ఆర్యన్, మిస్తీ చక్రవర్తి అన్ని టేకుల తర్వాతగానీ దర్శకుడిని మెప్పించలేకపోయారంట.

కార్తీక్ ఆర్యన్

By

Published : May 18, 2019, 1:38 PM IST

సినిమా అనే నౌకలో దర్శకుడే కెప్టెన్. సన్నివేశం తాను అనుకున్న విధంగా వచ్చే వరకు నటీనటులచేత ఎన్ని టేకులైనా చేయిస్తుంటాడు. అయితే రొమాంటిక్ సీన్లలో కొంచెం మినాహాయింపునిస్తాడు డైరెక్టర్. కానీ బాలీవుడ్ దర్శకుడు సుభాష్ ఘాయ్ ఈ విషయంలోనూ రాజీ పడలేదంట. ఆయన తెరకెక్కించిన కాంచి చిత్రంలో ఓ ముద్దు సన్నివేశం కోసం హీరోహీరోయిన్ల చేత 37 టేకులు చేయించాడంట!

కాంచి సినిమాలో కార్తీక్ ఆర్యన్, మిస్తీ చక్రవర్తి హీరోహీరోయిన్. వీరిద్దరిపై ముద్దు సన్నివేశం చిత్రీకరించారు దర్శకుడు సుభాష్. ఇద్దరూ కాస్త బిడియపడ్డారంట. ఆ తొందర్లో సన్నివేశం సరిగా రాలేదని మళ్లీ ముద్దుపెట్టుకోమన్నాడు దర్శకుడు. అలా కార్తీక్, మిస్తీలు 37 టేకులు తీసుకున్న తర్వాత గానీ సుభాష్ అనుకున్న ముద్దు రాలేదు. అంతసేపు ఈ ముద్దులాట చూసిన చిత్రబృందం రకరకాల జోకులు వేసుకున్నారంట.

ప్యార్​ కా పంచనామా సిరీస్​, సోనూ కే టీటూ కీ స్వీటీ, లుకా చుప్పీ లాంటి హిందీ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తీక్ ఆర్యన్. ప్రస్తుతం పతీ పత్నీ ఔర్ ఓ, ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమాలోనూ నటిస్తున్నాడు కార్తీక్.

ABOUT THE AUTHOR

...view details