తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మేకప్​ లేకుండా ట్రైన్​లో కీర్తి కుల్హరి - the girl on the train

బాలీవుడ్​లో సహాయక నటిగా పలు చిత్రాల్లో నటించిన కీర్తి కుల్హరి... తర్వాతి చిత్రంలో మేకప్​ లేకుండా నటిస్తోంది. పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న 'ద గర్ల్​ ఆన్​ ద ట్రైన్'​ చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది.

కీర్తి

By

Published : Aug 31, 2019, 5:06 PM IST

Updated : Sep 28, 2019, 11:37 PM IST

వెండితెరపై ఎప్పుడూ మేకప్​తోనే కనిపించే కథానాయికలు ప్రస్తుతం వినూత్న ప్రయోగాలకు తెరతీస్తున్నారు. ఇటీవల ముఖానికి రంగు లేకుండా ఉన్న చిత్రాలను సినీ తారలు కాజల్​, హంసా నందిని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అదే కోవలోకి బాలీవుడ్​ భామ కీర్తి కుల్హరి చేరింది. అయితే వారిలా కాకుండా ఈమె ఓ అడుగు ముందుకేసి ఓ సినిమాలో మేకప్​ లేకుండా నటిస్తోంది.

సహాయ నటిగా 'పింక్‌' (2016), 'ఉరి: ది సర్జికల్‌స్ట్రైక్స్‌' (2019), 'మిషన్‌ మంగళ్‌' (2019) చిత్రాల్లో కనిపించింది కీర్తి. ఆమె ప్రస్తుతం హాలీవుడ్‌ చిత్రం 'ద గర్ల్ ఆన్‌ ద ట్రైన్‌’' హిందీ రీమేక్‌లో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ లండన్‌లో జరుగుతోంది. ఇందులో ఆమె మేకప్‌ లేకుండా నటిస్తోంది.

" మేకప్‌ లేకుండా 'ద గర్ల్​ ఆన్​ ద ట్రైన్​' చిత్రంలో నటించబోతున్నా. నిజంగా చాలా ఆనందంగా ఉంది. ముఖానికి రంగు వేసుకోకుండా ఓ సినిమాలో నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. అయినా పాత్రలో బలం ఉంటే చాలు తెర మీద చక్కగా కనిపిస్తాం".
-కీర్తి కుల్హరి, సినీ నటి

రిభు దాస్‌ గుప్తా దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో పరిణీతీ చోప్రా కథానాయిక. అదితీ రావ్‌ హైదరి మరో కీలక పాత్రధారి. ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది చిత్రబృందం. రిభు దాస్‌గుప్తా దర్శకత్వంలోనే 'బార్డ్‌ ఆఫ్‌ బ్లడ్‌' అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది కీర్తి. సెప్టెంబరు 27న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్‌ ప్రసారం కానుంది.

ఇవీ చూడండి.. కరణ్​ పార్టీలో విమర్శలపై విక్కీ కౌశల్​ రియాక్షన్​

Last Updated : Sep 28, 2019, 11:37 PM IST

ABOUT THE AUTHOR

...view details