తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నవంబర్​లో నాగ్​ కొత్త సినిమా షురూ - అక్కినేని నాగార్జున థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధం కానున్నాడు

అక్కినేని నాగార్జున థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధం కానున్నాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ప్రేక్షకులను అలరించనున్నాడీ నటుడు.

నవంబర్​లో నాగ్​ కొత్త సినిమా షురూ

By

Published : Oct 22, 2019, 6:47 AM IST

2015లో విడుదలైన 'సోగ్గాడే చిన్నినాయన' చిత్రం కుటుంబ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో నాగార్జున చేసిన 'బంగార్రాజు' పాత్రకు విశేషమైన స్పందన లభించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్​ చేసే ప్రణాళికల్లో ఉన్నాడు దర్శకుడు కల్యాణ్ కృష్ణ. నాగార్జున-నాగ చైతన్య కాంబినేషన్​లో రానుందీ చిత్రం.

డిసెంబర్​లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లటానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. అలాగే నాగ్ ఓ హిందీ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నట్లు సినీ వర్గాల సమాచారం. వచ్చే నెలలో తన కొత్త సినిమాల విశేషాలను అధికారికంగా ప్రకటించనున్నాడు నాగ్. ఇక బంగార్రాజు సినిమాలో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ నటించనుంది.

ఇదీ చూడండి : 'కోట్లాది మంది ప్రేక్షకులకు కృతజ్ఞతలు'

ABOUT THE AUTHOR

...view details