Michael jackson movie: పాప్ దిగ్గజం మైకేల్ జాక్సన్ బయోపిక్కు రంగం సిద్ధమైంది. ప్రముఖ నిర్మాత, ఆస్కార్ విజేత గ్రాహమ్ కింగ్.. ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. అలానే ఆస్కార్ అవార్డుకు మూడుసార్లు నామినేట్ అయిన జాన్ లోగన్.. ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.
పాప్ సింగర్ మైకేల్ జాక్సన్ బయోపిక్.. టైటిల్ అదే!? - Michael Jackson movie news
Michael jackson biopic: ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ పాప్ సింగర్‌గా పేరు తెచ్చుకున్న మైకేల్ జాక్సన్ బయోపిక్ కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది. మరి మైకేల్ జాక్సన్ పాత్రలో ఎవరు నటిస్తారో చూడాలి?
మైకేల్ జాక్సన్
ఈ సినిమాకు 'మైకేల్' అనే టైటిల్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో మైకేల్ జాక్సన్ సొంత ఎస్టేట్ కూడా భాగమైంది. అయితే జాక్సన్.. గతంలో చిన్నారిపై అత్యాచారం చేశాడంటూ ఆరోపణలు వచ్చాయి. వీటిని సినిమాలో ఎలా చూపిస్తారనేది తెలియాల్సి ఉంది.
ఇవీ చదవండి: