టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్‌తో నటి కిమ్ శర్మ(kim sharma) రిలేషన్లో ఉందంటూ కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. జులైలో వారిద్దరూ కలిసి గోవాకు విహారయాత్ర కోసం వెళ్లారు. ఈ జంట కలిసున్న ఫొటోలను అక్కడి రెస్టారెంట్ తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ కూడా చేసింది. ఇప్పుడు ఆ వదంతులకు చెక్ పెడుతూ కిమ్, పేస్‌తో తన బంధం గురించి వెల్లడించింది. ఇన్‌స్టాలో అతడితో ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది.
ఇదే ఫొటోను తన ఇన్‌స్టా ఖాతాలోనూ పోస్ట్ చేసిన పేస్.. 'మ్యాజిక్' అనే క్యాప్షన్ రాసుకొచ్చాడు.