అక్టోబరు 23న కథానాయకుడు ప్రభాస్ పుట్టినరోజు. ప్రస్తుతం మూడు సినిమాలను డార్లింగ్ చేస్తుండటం వల్ల వాటి అప్డేట్ల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు నాగ్ అశ్విన్‌ను ట్యాగ్ చేస్తూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. స్పందించిన నాగ్ అశ్విన్.. 'కిల్లర్ అప్డేట్' త్వరలో రానుందని స్పష్టం చేశారు.
ప్రభాస్ పుట్టినరోజు బహుమతిగా 'కిల్లర్ అప్డేట్' - ప్రభాస్ దీపికా పదుకొణె
ప్రభాస్ సినిమాకు సంబంధించిన అప్డేట్ను త్వరలో అభిమానులతో పంచుకోనున్నట్లు దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పారు. దీంతో అభిమానులు అప్పుడే ఆనందంలో మునిగి తేలుతున్నారు.
"ఈ కరోనా వల్ల షూటింగ్ ప్రారంభం కావడానికి చాలా సమయముంది. అందువల్లే సినిమా గురించి ఎక్కువగా పంచుకోలేకపోతున్నాం. కానీ ప్రభాస్ పుట్టినరోజు కంటే ముందు ఓ కిల్లర్ అప్డేట్తో మీ ముందుకొస్తాం" అని నాగ్ అశ్విన్ ట్వీట్ చేశారు.
సైన్స్ ఫిక్షన్ కథతో తీస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తోంది. దిగ్గజ సింగీతం శ్రీనివాసరావు.. దర్శకత్వ పర్యవేక్షణ చేయనున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్.. భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ ఏడాది డిసెంబరులో చిత్రీకరణ ప్రారంభం కానుంది.