"నేను ఆవేశాన్ని నమ్ముతా. అందులో నుంచే మంచి కథలు, పాత్రలు పుడతాయి అని విశ్వసిస్తా" అన్నారు నందమూరి బాలకృష్ణ. తాజాగా ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'రూలర్'. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం వహించారు. సి.కల్యాణ్ నిర్మించారు. సోనాల్ చౌహాన్, వేదిక కథానాయికలు. ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడారు.
'పైరసీని ప్రోత్సహిస్తే.. నాణ్యమైన చిత్రాలు రావు' - రూలర్ విజయోత్సవ వేడుక
బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రూలర్'. శుక్రవారం విడుదలైన ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్‌ను నిర్వహించింది చిత్రబృందం.
"ఇంత చక్కటి విజయాన్నిచ్చిన ప్రేక్షక దేవుళ్లకు నా కృతజ్ఞతలు. నా తత్వానికి తగ్గట్లుగా పరుచూరి మురళి మంచి కథను సిద్ధం చేసిచ్చారు. అటు సాఫ్ట్‌వేర్ రంగంలోని ఇబ్బందులను, ఇటు రైతన్నల సమస్యలను చక్కగా ఆవిష్కరించారు. కథలో వినోదం ఎంత బాగా పండిందో అంతే చక్కగా భావోద్వేగాలు చూపించారు. ఇందంతా దర్శకుడి ఘనత. రవికుమార్ నిర్మాతల, నటుల దర్శకుడు. నటులకు కావల్సినంత స్వేచ్ఛ ఇచ్చి తనకు కావల్సిన హవభావాలు రాబట్టుకుంటారు. కల్యాణ్‌తో నాకిది మూడో చిత్రం. ఆయన బ్యానర్‌లో చేస్తుంటే సొంత సంస్థలో పనిచేస్తున్నట్లు ఉంటుంది." అన్నారు బాలయ్య.
ఇవీ చూడండి.. కృష్ణంరాజుని ప్రభాస్ ఏమని పిలుస్తాడంటే..!