బాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు రణవీర్ సింగ్.. విభిన్న ఫ్యాషన్‌తో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటాడు. ఇటీవలే ఈ హీరో వేసుకున్న కాస్ట్యూమ్ చూసి ఓ చిన్నారి భయపడి ఏడ్చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ముంబయిలోని ఓ డబ్బింగ్ స్టూడియో నుంచిరణవీర్ బయటకు వస్తుండగా ఫొటోల కోసం అభిమానులు, విలేకర్లు అతడ్ని చుట్టుముట్టారు. ఫొటోలకు పోజులిస్తూ, కారు ఎక్కుతుండగా అక్కడే ఉన్న ఓ చిన్నారి ఆ స్టార్ హీరోను చూసి భయపడింది. ఒక్కసారిగా వాళ్ల నాన్నను పట్టుకుని ఏడ్చేసింది.