బాలీవుడ్ చిత్రం 'గల్లీబాయ్' చూశారా! అందులో 'అప్నా టైమ్ ఆయేగా' అంటూ హీరో పాడే ర్యాప్ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ పాటను చాలామంది ఆలపించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. తాజాగా ఓ పిల్లాడు ప్రధాని నరేంద్ర మోదీపై పాటను పాడి ఆకట్టుకున్నాడు. ' 'ఫిర్ సే మోదీ ఆయేగా' (మోదీ మళ్లీ వస్తారు) అంటూ సాగే ఈ గీతం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
'ఫిర్ సే మోదీ ఆయేగా.. దేశ్ కో బచాయేగా' - modi
ప్రధాని నరేంద్ర మోదీపై ఓ పిల్లాడు 'గల్లీబాయ్' చిత్రంలోని పాటను పేరడీ చేశాడు. 'ఫిర్ సే మోదీ ఆయేగా' అంటూ సాగుతున్న ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ర్యాప్
నిమిషం పాటు సాగుతుంది ఈ పాట. '2014 లో మోదీయే గెలిచారు.. 2019లోనూ ఆయనే వస్తారు.. మళ్లీ మళ్లీ మోదీనే వస్తారు' అంటూ పిల్లాడు పాడిన ఈ పాట నెట్టింట సందడి చేస్తోంది. ఈ వీడియోపై విశేషంగా మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు నెటిజన్లు.