తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ముఖానికి రంగులద్దుకోవడం ఆనందంగా ఉంది' - కిచ్చా సుదీప్​

దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత చిత్రపరిశ్రమలో తిరిగి షూటింగ్​లు ప్రారంభమయ్యాయి. తాజాగా కన్నడ స్టార్​ హీరో సుదీప్.. తను​ నటిస్తున్న'ఫాంటమ్‌' చిత్రీకరణలో తిరిగి పాల్గొన్న విషయాన్ని తన ట్విట్టర్​ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ఆ సినిమాకు సంబంధించిన ఓ చిన్న వీడియోను అభిమానులతో పంచుకున్నారు.

Kicha Sudeep Resumes his New Movie Phantom Shooting
'ముఖానికి రంగులద్దుకోవడం చాలా ఆనందంగా ఉంది'

By

Published : Jul 20, 2020, 9:01 AM IST

కన్నడ నటుడు సుదీప్‌ కిచ్చ మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన 'ఫాంటమ్‌' సినిమా చిత్రీకరణను హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఆదివారం తిరిగి ప్రారంభించారు. ఈ సంతోషకరమైన విషయాన్ని ఆయన అభిమానులతో ట్విటర్‌లో పంచుకున్నారు. 'ఈ రోజు నా ముఖానికి రంగులద్దుకోవడం చాలా ఆనందంగా ఉంది.' అంటూ ట్వీటారు. ఈ సినిమాకు సంబంధించిన చిన్న వీడియోను అభిమానులతో పంచుకున్నారు.

ఇటీవలే తెలుగులో మెగాస్టార్​ చిరంజీవితో సైరాలో నటించిన సుదీప్​... ఆ తర్వాత బాలీవుడ్​లో సల్మాన్​తో 'దబాంగ్​ 3'లో కనిపించాడు. తాజాగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఆర్​ఆర్​ఆర్'​లోనూ ఓ కీలకపాత్రలో నటించే ఛాన్స్​ కొట్టేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సుదీప్‌ పోలీసు అధికారిగా కనిపించబోతున్నారని సమాచారం. ఇప్పటికే రాజమౌళి తెరకెక్కించిన 'ఈగ', 'బాహుబలి' చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు కిచ్చా సుదీప్​.

ABOUT THE AUTHOR

...view details