'వినయ విధేయ రామ' చిత్రంతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ కియారా అడ్వాణీ. అందచందాలతోనే కాదు డ్యాన్స్‌తోనూ కుర్రకారు మతిపోగడతానంటోంది. ప్రస్తుతం ఈ నటి డ్యాన్స్ చేసిన ఓ వీడియో నెట్టింట్లో సందడి చేస్తోంది. "నా ఫస్ట్ క్లాస్ డ్యాన్స్ భాగస్వామి వరుణ్ ధావన్‌తో కలిసి జీ పర్ఫామెన్స్ కోసం రిహార్సల్స్ చేస్తున్నా" అంటూ రాసుకొచ్చింది.
ఈ వీడియోలో వరుణ్ ధావన్‌తో కలిసి ఏబీసీడీ చిత్రంలోని సున్ సాథియా పాటకు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించింది కియారా. వారు వేసిన స్టెప్పులు కిర్రాక్ పుట్టించేలా ఉన్నాయి. ఇటీవలే వినయ విధేయ రామ చిత్రంతో పలకరించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్‌లో నటిస్తోంది.